భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు

WhatsApp Image 2026-04-09 at 3.20.15 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అప్పు చెల్లించలేదన్న నెపంతో ఒక అంగన్వాడీ టీచర్‌పై ఫైనాన్సర్లు అమానుషంగా ప్రవర్తించారు. బాధితురాలు తీసుకున్న అప్పు సకాలంలో తీర్చలేదనే కోపంతో, ఫైనాన్సర్లు ఆమెను గ్రామమధ్యలో ఓ చెట్టుకు కట్టేసి నానా దుర్భాషలాడారు. సుమారు గంటపాటు ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు.

మంగళవారం జరిగిన ఈ అమానవీయ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపై అవమానించిన వారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తనను అవమానపరిచిన ఫైనాన్సర్లపై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.