భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అప్పు చెల్లించలేదన్న నెపంతో ఒక అంగన్వాడీ టీచర్‌పై ఫైనాన్సర్లు అమానుషంగా ప్రవర్తించారు. బాధితురాలు తీసుకున్న అప్పు సకాలంలో తీర్చలేదనే కోపంతో, ఫైనాన్సర్లు ఆమెను గ్రామమధ్యలో ఓ చెట్టుకు కట్టేసి నానా దుర్భాషలాడారు. సుమారు గంటపాటు ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు.
మంగళవారం జరిగిన ఈ అమానవీయ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపై అవమానించిన వారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు…

