భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, ఏప్రిల్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

ff

పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , నవోదయ సంక్షేమ వేదిక , సిఐటియు కీసర మండల కమిటీ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహన

వైద్య శిబిరంలో పాల్గొన్న రాజకీయ నాయకులు గ్రామస్తులు

ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించిన జిల్లా డీసీసీ కార్యదర్శి బక్కని నర్సింగ్ రావ్ గారు

భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: చీరాల గ్రామంలో ఆదివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం వద్ద ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి కార్యదర్శి బక్కని నర్సింగరావు గారు రిబ్బన్ కట్ చేసి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.బక్కని నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడంతో పాటు పేదలకు కాంట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించడం హర్షనీయం అన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్లందరిని అభినందించారు.వైద్య శిబిరంలో కండ్ల పరీక్షలు కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ అనిల్ కుమార్ బృందం,దంత పరీక్షలు దమ్మైగూడ పద్మ సాయి డెంటల్ క్లినిక్స్ డాక్టర్ దినేష్ బృందం,కమల నగర్ శ్రీకర హాస్పిటల్స్ డాక్టర్ల బృందం బీపీ షుగర్ జనరల్ పరీక్షలు
డాక్టర్ కేర్ హోమియో ఏ ఎస్ రావ్ నగర్ బ్రాంచ్ డాక్టర్ల బృందం, నాగారం కుమారి వెంకటేష్ వెల్నెస్ ప్రోగ్రాం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 96 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. 17మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్లు అవసరమయ్యాయి. ఈ క్యాంపులో కోఆర్డినేటర్ జివి రావు, CH దేవి రెడ్డి, సునీల్ కుమార్, పురుషోత్తం రెడ్డి తోపాటు గ్రామస్తులు పలువురు నాయకులు పాల్గొని చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బోడ నర్సింగరావు, బిజెపి పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శ్రీనివాసరావు, చీర్యాల గ్రామ రామాలయం చైర్మన్ శివలింగాల శ్రీనివాస్ గౌడ్, కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్, బిఎస్పి పార్టీ మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షులు బోడ జంగయ్య, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బక్కని కుమార్ – జెకే, అంబేద్కర్ సంఘం నాయకులు మలగల శివకుమార్, బత్తుల రామచందర్, ఎంఆర్పిఎస్ కీసర మండల వైస్ ప్రెసిడెంట్ కంచమేది సంతోష్, సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు, సిఐటియు కీసర మండల నాయకులు చింతకింది అశోక్, డివిజన్ సంయుక్త కార్యదర్శి బోడ వెంకటేష్, చీర్యాల గ్రామ మాజీ వార్డు సభ్యులు మంకీ రాజు మరియు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.