భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంటర్ మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో నెల్లికుదురు ఆదర్శ కళాశాలకు చెందిన ఆరుగురు ఉత్తమ ఫలితాలు సాధించి మోడల్ కళాశాల టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో జి.అఖిల 955/1000, బైపీసీలో ఎండి సమీన 953/1000,సీఈసీ లో ఎ.వైష్ణవి 826/1000 ఉత్తమ మార్కులు సాధించారు.ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఎం.డి.సోహ 471/500, బైపిసి లో జి.చంద్రకళ 374/500, సీఈసీ లో ఎస్.శశాంక్ 363/500 అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో 100 మంది స్టూడెంట్స్ ఉండగా 43 మంది43% ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫస్ట్ ఇయర్ లో 92 మందికి 46 మంది పాసయ్యారని 50% ఉత్తీర్ణత పొందినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
13, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్