భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

మెదక్ నర్సింగ్ కాలేజీలో అధ్వానపు వసతులు

WhatsApp Image 2026-04-12 at 8.53.13 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మాజీ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు వారే వేణుగోపాల్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. 120 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

కుళ్ళిన కూరగాయలతో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారి విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి అక్రమంగా మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వసతులు కల్పించి, పరిశుభ్రత మెరుగుపరచకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని యాజమాన్యానికి సూచించారు.