భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మాజీ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు వారే వేణుగోపాల్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. 120 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

కుళ్ళిన కూరగాయలతో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారి విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం…