భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్

కీసరలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

WhatsApp Image 2026-04-14 at 9.19.09 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మేడ్చల్ : కీసర మండలం పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాలనీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా కాలనీ నివాసితులందరూ ఏకమై ఈ వేడుకను జరుపుకోవడం విశేషం.

రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తితో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితంగా, ఐకమత్యంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ కాలనీ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్, లక్ష్మీనారాయణ చారి, నరేష్, పెంటాచారి, దినేష్ రెడ్డి, కోటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.