భారత్ సమాచార్.నెట్, మేడ్చల్ : కీసర మండలం పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాలనీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా కాలనీ నివాసితులందరూ ఏకమై ఈ వేడుకను జరుపుకోవడం విశేషం.
రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తితో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితంగా, ఐకమత్యంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ కాలనీ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని…





