భారత్ సమాచార్.నెట్: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో వివిధ సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ వారం కూడా అంతే వినోదం అందించేందుకు సిద్ధం అయ్యాయి. వినాయక చవితి కానుకగా థియేటర్‌ల్లో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్‌లో సుందరకాండ, త్రిభాణదారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
‘త్రిబాణధారి బార్బరిక్’.. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. సుందరకాండ.. నారా రోహిత్ నటించిన చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది. దర్శకుడిగా వెంకటేశ్ నిమ్మలపూడి పరిచయం అవుతుండగా, సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక కన్యాకుమారి, అర్జున్ చక్రవర్తి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ సినిమాలకు అంతగా బజ్ లేదు.. కానీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన పరమ్ సుందరిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేరళలోని అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగే ప్రేమ ప్రయాణం.. ఈ వీకెండ్ థియేటర్‌లల్లో సందడి చేయనుంది. ఇక ఓటీటీలో మాత్రం చాలా సినిమాలే స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే:
నెట్‌ఫ్లిక్స్
అబిగైల్ (తెలుగు) – ఆగస్టు 26
మెట్రో ఇన్ డినో (హిందీ) – ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్
అప్‌లోడ్ 4 (వెబ్‌సిరీస్) – ఆగస్టు 25
హాఫ్ సీఏ2 (హిందీ సిరీస్) – ఆగస్టు 27
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ) – ఆగస్టు 29
జియో సినిమా
రాంబో ఇన్ లవ్ (తెలుగు) – ఆగస్టు 29