భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్

జనగణనలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలి: తహసిల్దార్ నరేష్

7

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనగణనలో వివరాలు అత్యంత జాగ్రత్తగా సేకరించాలని తహసిల్దార్ చంద నరేష్ సూపర్వైజర్లు,ఎన్యుమరేటర్లకు సూచించారు.
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,జిల్లా ప్రధాన గణన అధికారి పర్యవేక్షణలో స్థానిక ‘రైతు వేదిక’ భవనంలో జనగణన-2027 శిక్షణా కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి తహసిల్దార్ హాజరై మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పరదర్శకంగా పూర్తి చేయాలని చెప్పారు.కాగా ఈసారి జనగణన ప్రక్రియ పూర్తిస్థాయిలో మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతుంది.మొదటి విడత శిక్షణా కార్యక్రమం ఏప్రిల్ 18 నుండి 21 వరకు నిర్వహించబడనుంది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, శిక్షకులు,ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లు,పాల్గొన్నారు.గణన ప్రక్రియలో ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించి దేశాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.