భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనగణనలో వివరాలు అత్యంత జాగ్రత్తగా సేకరించాలని తహసిల్దార్ చంద నరేష్ సూపర్వైజర్లు,ఎన్యుమరేటర్లకు సూచించారు.
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,జిల్లా ప్రధాన గణన అధికారి పర్యవేక్షణలో స్థానిక ‘రైతు వేదిక’ భవనంలో జనగణన-2027 శిక్షణా కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి తహసిల్దార్ హాజరై మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పరదర్శకంగా పూర్తి చేయాలని చెప్పారు.కాగా ఈసారి జనగణన ప్రక్రియ పూర్తిస్థాయిలో మొబైల్ యాప్ ద్వారా…