భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి, పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్అధికారప్రతినిధి ,వెల్దుర్తి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , మహేష్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రజలు పోరాటం చేశారని, అలాంటి చారిత్రాత్మక ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి మొదటి నుంచే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను బీజేపీ నాయకులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మెదక్ జిల్లా కాంగ్రెస్అధికారప్రతినిధి ,వెల్దుర్తి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్ మాన్ కార్యదర్శి తలారి మల్లేష్ ,మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
19, ఏప్రిల్ 2026, ఆదివారంభారత్ సమాచార్