భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ (మానుకోట) పట్టణం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయడం, వారికి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని సాదుల సారంగపాణి ఏసీపి అధ్యక్షులు, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, పుట్టా శంకరయ్య డెవలప్మెంట్ మెంబర్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ విల్లు బాణాలను ఉపయోగించి లక్ష్యాన్ని ఛేదించే ప్రాచీనమైన మరియు ప్రతిష్ఠాత్మక క్రీడ అయిన ఆర్చరీ (విలువిద్య)*లో శిక్షణ పొందేందుకు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ మరియు వరంగల్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్, శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ ఆర్చరీ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది.
వేదిక: ప్రభుత్వ ఉన్నత పాఠశాల , మహబూబాబాద్ (మానుకోట)
– ప్రారంభం: 26 ఏప్రిల్, ఆదివారం
– సమయం: ఉదయం 6-8, సాయంత్రం 4.30-6.30, నెల రోజుల పాటు
– అర్హత: 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురు, బాలికలు
– తరగతులు: 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు
– ఫీజు: పూర్తిగా ఉచితం
ఈ కోచింగ్ క్యాంప్ ద్వారా విద్యార్థులకు ఆర్చరీలో ప్రాథమిక నైపుణ్యాలతో పాటు, శారీరక దారుఢ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు పోటీ స్థాయి అవగాహనను పెంపొందించబడుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో రాణించేందుకు ఇది ఒక బలమైన పునాది అవుతుంది.
– తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి:
మీ పిల్లలలో ఉన్న క్రీడా ఆసక్తిని గుర్తించి, వారిని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించండి. ఆర్చరీ క్రీడలో భవిష్యత్తు ఉన్నత అవకాశాలను అందించగలదని గుర్తుంచుకోండి. ఈ వేసవి సెలవులను మీ చిన్నారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వినియోగించండి.
మరిన్ని వివరాలకు 9394643139, 9494543139 సంప్రదించాలన్నారు.