భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మొక్కజొన్నలకు,వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు, దళారుల బారిన పడగకుండా రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం ఆలేరులో మార్క్ఫెడ్,శ్రీరామగిరి పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం,నెల్లికుదురు,శ్రీరామగిరి,ఎర్రబెల్లి గూడెం పిఎసిఎస్ ల ఆధ్వర్యాల లో శ్రీరామగిరి,ఎర్రబెల్లి గూడెం,రామన్నగూడెం,మేచరాజుపల్లి, గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటలను నిర్దేశించిన మాయిశ్చర్ వచ్చేంతవరకు ఆరబోసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే వెంట వెంటనే కాటా పెడతారన్నారు. రైతులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను కోరారు.వెంటనే కాటాలు పెట్టి తరలించాలన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, పంటలకు బోనస్, మద్దతు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కూడు, గూడు కు కొదవ ఉండకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చే దొడ్డు బియ్యాన్ని కాదని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళల ప్రయాణం కోసం ఫ్రీ బస్సు, గృహ అవసరాలకు ఉచిత కరెంట్, సబ్సిడీపై గ్యాస్ పంపిణి, పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పెంపు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పద్మ సత్యపాల్ రెడ్డి, మాదరి ప్రశాంత్,పులి నర్సయ్య,గుండెబోయిన ఉష అశోక్, తూర్పాటి శంకరయ్య,సుజాత వాసు,ధనమ్మ అమృ,హేమలత శ్రీనివాస్,ఉప సర్పంచ్ లు సుమన్,సాంబమూర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,పి ఐ సి కె రమేష్, ఏవో మహేందర్,ఏఈఓ ప్రతిభ,పిఎసిఎస్ సీఈఓలు కత్తుల వెంకన్న,బందారపు యాదగిరి గౌడ్,సుభాష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుతోట సతీష్,పెరుమాండ్ల రాజు గౌడ్,మద్దెల సమ్మయ్య,బెల్లి నరసయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
20, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్