భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఆగస్టు 2025, బుధవారంభారత్ సమాచార్

Movie Collections: విడుదలైన 30 రోజులకే రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదే!

mahavatar-narsimha-1

భారత్ సమాచార్.నెట్: ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 30 రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లు వసూలు చేసిన యానిమేటెడ్ చిత్రాల చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

 

హిందే పురాణాల నేపథ్యంతో రూపొందిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ జూలై 25న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఇది మొదటి భాగం.

 

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌ పేరుతో ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ భారీ విజయం యానిమేటెడ్ చిత్రాలకు భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉందని నిరూపించింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా, మహావతార్ నరసింహ ఇండియన్ యానిమేషన్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడంతో.. మేకర్స్ కొత్త ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.

మరిన్ని కథనాలు:

Movies: వినాయక చవితి కానుకగా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే