భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా కౌడ శ్రీనివాస్ గుప్తా

3

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కౌడ శ్రీనివాస్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తూప్రాన్ లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలో మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే కౌడిపల్లి గ్రామానికి చెందిన ఉడుత మురళి బాలరాజు మూట్రాజ్ పల్లి సహాయ కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు కావున శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య సంఘానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు
ఈ సమావేశానికి కౌడిపల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉడుత వెంకటేశం గుప్తా ఉడత రాజు గుప్తా గుప్తా , నాడ్ల వెంకటేశం గుప్తా, సిద్ధిరాములు గుప్తా, బాలకిషన్ గుప్తా నర్సింలు గుప్త రవీందర్ గుప్తా శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ గుప్తా శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.