భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

బిజెపి నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలి

9

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బిజెపి ప్రభుత్వం మోడీయే కారణమని, మోడీ ప్రభుత్వం కుట్రతో మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణతో డీలిమిటేషన్ & కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మహిళలకు రిజర్వేషన్ తీసుకురావడం కాదని అన్నారు. మోడీ మరియు బిజెపి నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చిందని మహిళను దేశ ప్రధాని చేసిందని పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రపతిగా లోక్ సభ స్పీకర్ గా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు తెలుపుతుందని అలా కాకుండా మహిళా రిజర్వేషన్ చట్టం ముసుగులో డీలిమిటేషన్ కు ముడి పెడితే కాంగ్రెస్ పార్టీ సహకరించదని అని తెలిపారు. నిజంగా మోడీకి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేవలం మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, శివ్వంపేట్ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్,సర్పంచ్ రవీందర్ యాదవ్, దాడిగా నరేష్, మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.