భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, లాలు తండా, రాము తండాలలో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై కట్టుకోని వారి స్థానంలో అర్హులైన ఇతరులకు అవకాశం కల్పించాలని సూచించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఏటీసీ నిర్మాణానికి వెంటనే భూమి సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విధులకు గైర్హాజరైన విద్యుత్ ఏఈకి మెమో జారీ చేయాలని ఆదేశిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి, ఎంఈఓ రూప రాణి, ఏవో మహేందర్, దిశ కమిటీ సభ్యులు బాబురావు, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.