భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఆగస్టు 2025, బుధవారంభారత్ సమాచార్

Actor Vijay: ప్రముఖ నటుడు విజయ్‌పై కేసు నమోదు!

Vijay-Booked-For-Manhandling

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ తమిళ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్‌‌పై కేసు నమోదైంది. ఇటీవల మధురైలో టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యం ఏంటంటే విజయ్‌పై కేసు పెట్టింది ఆయన అభిమానే. విజయ్‌ను కలిసేందుకు వచ్చిన అతనిపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు విజయ్ అభిమాని.

 

ఆగస్ట్ 21న మధురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే తన అభిమాన నటుడిని కలిసేందుకు ప్రతయ్నించిన శరత్ కుమార్‌ అనే వ్యక్తిని విజయ్ బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారని శరత్ కుమార్ మధురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటుడు విజయ్ మరియు ఆయన బౌన్సర్లపై అధికారికంగా కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.

 

కాగా విజయ్ మహానాడు కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్, కార్యకర్తులకు అభివాదం చేసేందుకు వేదిక మధ్యలో ఉన్న ర్యాంప్‌ మీదకు నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టే్‌పైకి దూకి మరి విజయ్‌ను కలిసేందుకు యత్నించగా.. ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు బౌన్సర్లు. ఈ నేపథ్యంలోనే బౌన్సర్లు తమపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.

మరిన్ని కథనాలు:

TN: తమిళనాట ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో