భారత్ సమాచార్.నెట్: ప్రముఖ తమిళ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఇటీవల మధురైలో టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యం ఏంటంటే విజయ్‌పై కేసు పెట్టింది ఆయన అభిమానే. విజయ్ను కలిసేందుకు వచ్చిన అతనిపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు విజయ్ అభిమాని.
ఆగస్ట్ 21న మధురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే తన అభిమాన…

