భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

బీఎస్పీ నేతకు నివాళులు

FF

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామంలో BSP ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు శాంతయ్య గారు మరణించారు. వారి పార్దివదేహాన్ని దర్శించి పూల మాలవేసి ఘన నివాళులర్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి.ఈ సందర్భంగా తెలంగాణ బహుజన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ, బహుజన రాజ్య స్థాపన కోసం తన చివరి శ్వాస వరకు శ్రమించిన నిస్వార్థ నాయకుడు శాంతన్న అన్నారు. శాంతి కుమార్ మృతి బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవీందర్,నాగులపల్లి సర్పంచ్ సుమతి శివకుమార్, లింగం,మోహనదాస్,సాయి శరణ్ గౌడ్,రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.