భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఆగస్టు 2025, బుధవారంభారత్ సమాచార్

ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ను క‌డ‌తేర్చిన భార్య‌.. క‌ట్ చేస్తే

03

భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్: భ‌ర్త‌ల‌ను భార్య‌లు చంపుతున్న ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. క్ష‌ణికావేశంలో ఈ దారుణాల‌కు పాల్ప‌డుత‌న్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించాడని అందరినీ నమ్మించిన ఓ భర్త మృతిపై, గల్ఫ్ నుంచి వచ్చిన కుమారుడికి కలిగిన అనుమానం పోలీసులకు చేరడంతో ఈ ఘాతుకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడించారు.

సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మి(48), ఆమె భర్త హరిచరణ్(50)కు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమై అత్తవారింట్లో ఉంటోంది. కుమారుడికి మూడేళ్ల క్రితం వివాహమైంది. అతను ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా కోడలు అత్తామామలతో కలిసి ఉంటోంది. హరిచరణ్ తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన అంకం మహేశ్(45)తో నాగలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్ప‌డింది. ఈ విషయమై దంపతులకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 22న అర్ధరాత్రి నాగలక్ష్మి మహేశ్ తో కలిసి వస్తుండగా హరిచరణ్ చూసి గొడవపడ్డాడు. మహేశ్‌పై బ్యాట్‌తో దాడి చేయబోగా, నాగలక్ష్మి, మహేశ్ కలిసి హరిచరణ్ ను ఇంట్లోకి లాక్కెళ్లారు. నాగలక్ష్మి తువాలుతో అతని కాళ్లను బంధించగా, మహేశ్ చీరతో మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం, మూర్ఛతో చనిపోయినట్లు బాత్రూంలో పడేశారు. గల్ఫ్ నుంచి వచ్చిన కుమారుడు అంత్యక్రియలు పూర్తిచేశాడు. తండ్రి చ‌నిపోయినా త‌ల్లి ముఖంలో బాధ క‌న‌ప‌డ‌క‌పోవడంతో అనుమానం వ‌చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో పోలీసులు నాగలక్ష్మి, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువ‌కుడు.. యువతి ఆత్మహత్య