భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్: భ‌ర్త‌ల‌ను భార్య‌లు చంపుతున్న ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. క్ష‌ణికావేశంలో ఈ దారుణాల‌కు పాల్ప‌డుత‌న్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించాడని అందరినీ నమ్మించిన ఓ భర్త మృతిపై, గల్ఫ్ నుంచి వచ్చిన కుమారుడికి కలిగిన అనుమానం పోలీసులకు చేరడంతో ఈ ఘాతుకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడించారు.

సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మి(48), ఆమె భర్త హరిచరణ్(50)కు 30…