భారత్ సమాచార్.నెట్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పై మొత్తం 50 శాతం సుంకాల భారం పడింది. ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్‌పై ఇదే స్థాయిలో టారిఫ్ వసూలు చేస్తోంది అమెరికా. కాగా భారత్ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం దాదాపు 48.2 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా.
అయితే అమెరికా విధించిన ఈ సుంకాలు భారతీయ వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, రొయ్యలు, తివాచీలు, ఫర్నిచర్ వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని వస్తువులకే 50 శాతం టారిఫ్ నుంచి మినహాయింపు ఉంది. వాటిలో ఫార్మా, ఇంధన, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఉన్నాయి.
అమెరికా అధిక టారిఫ్‌లతో భారత్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. దీని వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణలు హెచ్చరిస్తున్నారు. కాగా, భారత్ ఎగుమతిదారులు ఇప్పటికే కొత్త ఆర్డర్లను కోల్పోతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నాయి. మరోవైపు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
మరిన్ని కథనాలు:
Jaishankar: సమస్య ఉంటే కొనడం మానేయండి: ట్రంప్‌కు జైశంకర్ కౌంటర్