భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, ఆగస్టు 2025, శుక్రవారంభారత్ సమాచార్

Bihar: బిహార్‌లోకి చొరబడిన ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. !

bihar_on_high_alert_three_jaish_muhammad_terrorists_enter_into_india_via_nepal_1756366695099

భారత్ సమాచార్.నెట్: మరికొన్ని నెలల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన జేషే మహ్మద్ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.

 

ముగ్గరు ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి పేర్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదిగా బీహార్‌లోకి చొరబడ్డట్లు పేర్కొంది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాలతో పాటు మొత్తం రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నేపాల్‌తో సరిహద్దు ఉన్న జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అనుమానిత ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి, పాకిస్థాన్), అదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్, పాకిస్థాన్), మహమ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్, పాకిస్థాన్)గా గుర్తించారు. వీరు ముగ్గురూ ఆగస్టు మొదటి వారంలో కాఠ్మాండుకు చేరుకుని.. పోయిన వారం బీహార్‌లోని సుపౌల్ జిల్లా గుండా భారత్‌లోకి చొరబడినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని కథనాలు:

Terror Threat: భారత్‌కు పొంచి ఉన్న ఉగ్రముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు