భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, ఆగస్టు 2025, శుక్రవారంభారత్ సమాచార్

రానున్న 48 గంటల్లో జిల్లాకు భారీ వ‌ర్ష‌సూచ‌న‌

01

భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్: రానున్న 48 గంటల పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాల వల్ల తెగిపడిన విద్యుత్ తీగలను, స్తంభాలను తాకవద్దని, పాత భవనాలు, గోడలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ వైర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని, సహాయక చర్యలు చేపడతామని కమిషనర్ భరోసా ఇచ్చారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 కు సంప్రదించాలని తెలిపారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కుండపోత వర్షం.. ఇంకా జలదిగ్భంధంలోనే