భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: రానున్న 48 గంటల పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాల వల్ల తెగిపడిన విద్యుత్ తీగలను, స్తంభాలను తాకవద్దని, పాత భవనాలు, గోడలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువుల…





