భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం నేపథ్యంలో రేపు నర్సాపూర్ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ…మంగళవారం ఉదయం 10గంటలకు నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ, పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. రేపటి ర్యాలీలో టీపీసీసీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, తాజా మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు, కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
BHARATH SAMACHAR DIGITAL
1, సెప్టెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్