- 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి
భారత్ సమాచార్, సినిమా: 120 దేశాల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘SSMB29’ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB29’ పట్ల దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పాన్ వరల్డ్ సినిమాకి షూటింగ్ వేగంగా కొనసాగుతున్నది. తాజాగా కెన్యా షెడ్యూల్ పూర్తయింది. అక్కడే ఎక్కువ భాగం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ముఖ్యంగా అడ్వెంచరస్ సీక్వెన్సులు, నేచర్ బ్యూటీని హైలైట్ చేసే సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వనున్నాయి. కెన్యా నుంచి ఇండియాకు బయలుదేరే ముందు మూవీ టీమ్‌ను ఆ దేశ మంత్రి ముడావడి ముసాలియా ప్రత్యేకంగా కలిసారు.
ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో పేర్కొంటూ.. “SSMB29 120 దేశాల్లో విడుదల కానుంది. ఇందులో 95% ఆఫ్రికన్ సన్నివేశాలను కెన్యాలోనే చిత్రీకరించారు. మా దేశ సహజసిద్ధమైన అందాలు, ఆతిథ్యాన్ని ప్రపంచం ఆస్వాదించబోతోంది” అని వెల్లడించారు.
ఈ సినిమా స్థాయి చూస్తే ఇది కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా తీసుకొని రూపొందుతున్నది అర్థమవుతోంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రియాంకా – మహేష్ కాంబినేషన్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ‘SSMB29’ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో తెలుగు సినిమా సత్తాను మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతోందనే నమ్మకం అభిమానులలో పెరుగుతోంది.
మరిన్ని కథనాలు:
వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో జింబాబ్వే ఆల్‌రౌండర్..