భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

గణేష్ శోభాయాత్రలో పాల్గొన్న డీఎస్పీ

12

భార‌త్ స‌మాచార్‌.నెట్, మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గణేష్ శోభాయాత్రలో డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరిని వారు దర్శించుకున్నారు. మహిళలు కోలాటాలు వేస్తూ, మంగళ వాయిద్యాలతో శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, హరీష్, చంద్రశేఖర్ గుప్తా, మిర్యాల చంద్రశేఖర్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

యుద్ధ ప్రాతిపదికన వరద నష్టం అంచనా వేయాలి: క‌లెక్ట‌ర్