భార‌త్ స‌మాచార్‌.నెట్, మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గణేష్ శోభాయాత్రలో డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరిని వారు దర్శించుకున్నారు. మహిళలు కోలాటాలు వేస్తూ, మంగళ వాయిద్యాలతో శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, హరీష్,…