భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

04

భార‌త్ స‌మాచార్‌.నెట్‌, మెదక్: విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. నర్సాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లుగా రూ.8,158కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమని, తక్షణమే ఒక మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించి వాటిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్