భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

మీరు అంజీర్ పండ్లు తింటున్నారా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా!

10

భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్: అంజీర్ పండ్లు ఏడాది పొడవునా లభించే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్. చూసేందుకు అంత ఆకర్షణీయంగా లేకపోయినా, వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘం. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో తరచుగా వచ్చే ఫుడ్ పాయిజనింగ్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి, దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్ పండ్లలో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే, మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. వర్షాకాలంలో వచ్చే అలసట, నీరసం నుంచి ఉపశమనం పొందడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అంజీర్ పండ్లు దోహదం చేస్తాయి. చర్మ సమస్యలను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీటిని నేరుగా తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. రక్త సరఫరాను మెరుగుపరచి, బీపీని నియంత్రణలో ఉంచుతాయి. అన్ని సీజన్లలోనూ వీటిని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

చేతులు, కాళ్లు చల్లగా ఉంటున్నాయా.. అంతర్గత వ్యాధులకు సంకేతం కావచ్చు!