భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్: అంజీర్ పండ్లు ఏడాది పొడవునా లభించే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్. చూసేందుకు అంత ఆకర్షణీయంగా లేకపోయినా, వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘం. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో తరచుగా వచ్చే ఫుడ్ పాయిజనింగ్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి…