భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కలెక్టరేట్లో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల కులదేవతగా, అహింసా మూర్తిగా వాసవి మాతకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డీపీఆర్వో రామచంద్ర రాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు చంద్రపాల్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పల్లెర్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి బుక్క అశోక్, కోషాధికారి మరుమల్ల అశోక్, ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ చైర్మన్ రాయకంటి నాగరాజు, పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్, ఉప్పల శ్రీకాంత్, కోవురి శ్రీనివాస్, షిర్నా రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చంద్రపాల్, వుట్కురి వీరేశం, కౌన్సిలర్ శివరామకృష్ణ , కొండా శ్రీనివాస్, పురం వెంకట నారాయణ, కొమ్మ వెంకటేష్, బజ్జూరి బిక్షపతి, మురళి, పొగాకు రామకృష్ణ, వనజ, సుష్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
27, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్