భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

రామాయంపేటను మళ్ళీ నియోజకవర్గంగా మారుస్తాం

WhatsApp Image 2026-04-26 at 5.02.03 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: రామాయంపేటలోని బీజేపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం అత్యంత బాధాకరమని, ఇది మహిళా లోకాన్ని వంచించడమేనని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణ భారతదేశానికి ఎటువంటి నష్టం జరగదని, దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరగనుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలు, 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా 33 శాతం రిజర్వేషన్‌తో సుమారు 65 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మెదక్ జిల్లాలో డీలిమిటేషన్ ద్వారా కొత్తగా రెండు మూడు అసెంబ్లీ సీట్లు ఏర్పడతాయని, అందులో రామాయంపేటను తిరిగి నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణ బాధ్యత తమదేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల శేఖర్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్, సర్పంచులు బక్కయ్య గారి యాదగిరి, ఆకుల రమేష్, పట్టణ నాయకులు పబ్బ సత్యనారాయణ, అక్కన్నపేట మాజీ ఎంపీటీసీ వెలుమల సిద్ధరాములు, పట్టణ నాయకులు అనిల్, కటిక కార్తిక్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, పట్టణ నాయకులు రమణ, భానుచందర్, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు