భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియూ నాయకులు కార్మిక జెండాలను ఎగరవేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ.. అమెరికా చికాగో నగరంలోని కార్మికుల పనిగంటలు 18 గంటల నుంచి 8 గంటలకు తగ్గియాలని నిరసన చేస్తున్న కార్మికులపై పోలీసులు తుపాకుల తూటాలతో విరుచుకుపడి అనేక మంది కార్మికులను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రక్తపు మడుగులో నుంచి తీసిన జెండానే ఎర్ర జెండాగా నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల, కర్షకుల కోసం నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. ఆనాటి కార్మికులు “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే నినాదంతో నేడు అనేక మంది కార్మికులు తమ హక్కులను సాధించుకుంటున్నారని గుర్తుచేసారు. నాటి చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో నేటి కార్మికులు, కర్షకులు అందరూ కలిసి నేడు రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నియంత ప్రభుత్వాలపై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నేడు కేంద్రంలో పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, భాషల పేర్లతో దేశ ప్రజలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. తక్షణమే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగించాలని, 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు అన్నపూర్ణ, పుష్ప, రాములు, రిజ్వనా, భీమేష్, నర్సింలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
2, మే 2026, శనివారంభారత్ సమాచార్