భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియూ నాయకులు కార్మిక జెండాలను ఎగరవేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ.. అమెరికా చికాగో నగరంలోని కార్మికుల పనిగంటలు 18 గంటల నుంచి 8 గంటలకు తగ్గియాలని నిరసన చేస్తున్న కార్మికులపై పోలీసులు తుపాకుల తూటాలతో విరుచుకుపడి అనేక మంది కార్మికులను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రక్తపు మడుగులో నుంచి తీసిన జెండానే…