భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, మే 2026, గురువారంభారత్ సమాచార్

రైల్వే ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం

WhatsApp Image 2026-05-06 at 6.57.08 PM

భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: భారత రైల్వేలో 2 శాతం ఉద్యోగాల కోత నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో బుధవారం ‘పోస్ట్‌కార్డు ఉద్యమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. రైల్వేలో ఇప్పటికే సుమారు 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా పోస్టులను తగ్గించడం యువత భవిష్యత్తుపై దాడి చేయడమేనని మండిపడ్డారు. రైల్వే బోర్డు తీసుకున్న 29,608 పోస్టుల కోత నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఆర్‌బీ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రధాని, రైల్వే మంత్రికి పోస్ట్‌కార్డులు పంపారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, నియామకాలు చేపట్టకుండా పోస్టులను రద్దు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మారోజు నరసింహాచారి, సహాయ కార్యదర్శి గుండెగని నాగరాజు, కనకపోయిన నందు, రాకేష్, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సల్వాద్రి రవీందర్, బోడిగె సుదర్శన్, కట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.