భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన చిందం బుజ్జమ్మ-కిష్టయ్య దంపతుల కుమార్తె పూజ వివాహం బుధవారం నాగిరెడ్డిపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫౌండేషన్ తరఫున సామాజిక బాధ్యతగా ‘ఆడపడుచు కానుక’ కింద రూ.10వేల రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
7, మే 2026, గురువారంభారత్ సమాచార్