భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన చిందం బుజ్జమ్మ-కిష్టయ్య దంపతుల కుమార్తె పూజ వివాహం బుధవారం నాగిరెడ్డిపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫౌండేషన్ తరఫున సామాజిక బాధ్యతగా ‘ఆడపడుచు కానుక’ కింద రూ.10వేల రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.…