భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

పశువుల ఆరోగ్యమే రైతులకు బలం

WhatsApp Image 2026-05-08 at 5.29.16 PM (1)

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పశువైద్య, అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్వయంగా దూడలు, గొర్రెలకు నులిపురుగుల నివారణ మందులు వేసి, రైతులకు ఖనిజ మిశ్రమాలను పంపిణీ చేశారు.

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగమే వెన్నెముక అని కొనియాడారు. రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంతానోత్పత్తి సేవలను ఉపయోగించుకుని పాల ఉత్పత్తిని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, ఇతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.