భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

వైభవంగా శ్రీలక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం

WhatsApp Image 2026-05-08 at 7.52.06 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలోని చారిత్రక శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. దేవస్థానం కమిటీ రిషికేష్ బట్టర్ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీనారాయణుల పరిణయ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

కళ్యాణం అనంతరం భక్తులకు మహాన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం వేళ గ్రామంలో స్వామివారి రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, స్థానిక సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రిషికేశ్ బట్టర్, శ్రీరామ బట్టర్, కన్నయ్య, సంపత్ బట్టర్, వావిజ బట్టర్, ఆలయ కమిటీ ఛైర్మన్ శేరు శ్రీనివాస్, గడ్డం వెంకటేష్, కూరెల్లి సతీష్, రావుల మల్లేశం, యాకయ్య, యాకమూర్తి, చిర్రగొని రణధీర్, ఉదయ్ ధీర్, ఉమ్మగోని ఐలయ్య, రాంచంద్రు, మహేశ్వరా చారి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.