భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలోని చారిత్రక శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. దేవస్థానం కమిటీ రిషికేష్ బట్టర్ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీనారాయణుల పరిణయ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

కళ్యాణం అనంతరం భక్తులకు మహాన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం వేళ గ్రామంలో స్వామివారి రథోత్సవాన్ని అత్యంత…