భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో శ్రీ శీతలా పరమేశ్వరి (బొడ్రాయి), కట్టమైసమ్మ, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల పునఃప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్న ఆయన, దేవతామూర్తుల పునఃప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
9, మే 2026, శనివారంభారత్ సమాచార్