భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ జిల్లా: నగరంలోని చిక్కడపల్లిలో గల ప్రముఖ ‘క్రియేటివ్ మైండ్స్ స్కూల్’ ప్రాంగణంలో ఆదివారం ‘మదర్స్ డే’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లలు, తల్లుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పాఠశాల ప్రిన్సిపల్ శృతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రతి బిడ్డ జీవితంలో అమ్మే తొలి గురువు, తొలి స్నేహితురాలు. నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు అమ్మ. సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర వెలకట్టలేనిది. పిల్లల్లో సంస్కారం, క్రమశిక్షణను పెంపొందించడంలో తల్లుల కృషి అమోఘం” అని మాతృమూర్తుల గొప్పతనాన్ని కొనియాడారు.
తల్లులు తమ పిల్లలతో కలిసి నిర్వహించిన మ్యూజికల్ చైర్స్, చేతిముద్రల కార్డులు, సెల్ఫీ కార్నర్, క్విజ్ వంటి పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం తల్లులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంపొందించేలా పలు క్రీడలు, సృజనాత్మక పోటీలు నిర్వహించారు. నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే మాతృమూర్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శృతితో పాటుగా క్రియేటివ్ మైండ్స్ అధినేత ఆనంద్, టీచర్స్ వైష్ణవి, వీణా, విద్యార్థులు విప్రియ ఇండియా, నిధిశ్రీ, చైత్ర, అరుష్, బద్రీనాథ్, సహస్రంష్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్