భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, మే 2026, సోమవారంభారత్ సమాచార్

Mothers Day celebrations: క్రియేటివ్ మైండ్స్ స్కూల్‌లో ఘనంగా ‘మదర్స్ డే’ వేడుకలు..

WhatsApp Image 2026-05-10 at 9.07.17 PM (1)

భారత్ సమాచార్, హైదరాబాద్: Mothers Day celebrations

చిక్కడపల్లిలోని ప్రముఖ ‘క్రియేటివ్ మైండ్స్ స్కూల్’ ప్రాంగణంలో ‘మదర్స్ డే’ వేడుకలను ఆదివారం (మే 10)న ఘనంగా నిర్వహించారు. పిల్లలు, తల్లుల కలయికతో స్కూల్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపల్ హేమ శృతి ‘మదర్స్ డే’ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రతి బిడ్డ జీవితంలో అమ్మే తొలి గురువు, తొలి స్నేహితురాలు. నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు అమ్మ. సమాజంలో తల్లి పాత్ర వెలకట్టలేనిది. పిల్లల్లో సంస్కారం, క్రమశిక్షణ పెంపొందించడంలో తల్లుల కృషి అమోఘం,” అని ‘మదర్స్ డే’ ప్రాముఖ్యతను ప్రిన్సిపల్ శృతి వివరించారు.

ఆటపాటలతో సందడి చేసిన తల్లులు..

తల్లులు తమ పిల్లలతో కలిసి నిర్వహించిన మ్యూజికల్ చైర్స్, చేతిముద్రల కార్డులు, సెల్ఫీ కార్నర్, క్విజ్ వంటి పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం తల్లులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంపొందించేలా పలు క్రీడలు, సృజనాత్మక పోటీలు నిర్వహించారు. నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే మాతృమూర్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హేమ శృతితో పాటుగా క్రియేటివ్ మైండ్స్ అధినేత ఆనంద్, టీచర్స్ వైష్ణవి, వీణా, విద్యార్థులు విప్రియ ఇండియా, నిధి శ్రీ, చైత్ర, అరుష్, బద్రీనాథ్, సహస్రంష్ తదితరులు పాల్గొన్నారు.