భారత్ సమాచార్, (ఇనుగుర్తి) మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మొదటి గేటు త్వరలో తెరుచుకోనుంది. ఈ మేరకు స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ సోమవారం పరిశీలించి డోజర్ తో గేటు వద్ద ఉన్న చెట్లను ముళ్ళ పొదలను తొలగింప చేశారు. సంబంధిత హైస్కూల్ కు పాఠశాలకు పడమర దిక్కున ఉన్న చావడి వైపు మెయిన్ బజార్లో దశాబ్దాల కాలం నుంచి మెయిన్ ద్వారం ఉండేది. ఈ గేటు వాస్తుకు లేదని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మూసి వేసి ఉత్తరం వైపున గేటు ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగించారు. ఈ గేటు అంతగా అనుకూలంగా లేదని గ్రామస్తులు, విద్యాభిమానులు నాటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లకు మొదటి ద్వారాన్ని ఓపెన్ చేయడానికి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ చొరవ తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
12, మే 2026, మంగళవారంభారత్ సమాచార్