భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, మే 2026, మంగళవారంభారత్ సమాచార్

విద్యార్థుల ప్రతిభ వికాసానికి వేసవి శిక్షణ శిబిరం

WhatsApp Image 2026-05-11 at 5.47.34 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి, వారి ప్రతిభను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వేసవి శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, ఇలాంటి శిక్షణ శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలతో పాటు కళలు, క్రీడలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఈ శిబిరం ఒక అద్భుతమైన వేదిక అని ఆయన తెలిపారు.

ఈ శిబిరంలో విద్యార్థుల కోసం చిత్రలేఖనం, యోగా, క్రీడలు, సంగీతం, నృత్యం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వంటి అంశాలపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, శిక్షకులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటస్వామి, శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, ఖదీర్, విజయ్ మోహన్, అమూల్య, అర్చన, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సృజన, సీఆర్పీ రాజు, జూనియర్ అసిస్టెంట్ మల్లేష్, సాబెర్ తదితరులు పాల్గొన్నారు.