భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక బి.వి.ఆర్.ఐ.టి కళాశాల ఆడిటోరియంలో నియోజకవర్గంలోని 9 మండలాల సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు, ‘బడిబాట’ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణకు, విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా నర్సాపూర్ ఛైర్మన్ లక్ష్మీ యాదవ్, తూప్రాన్ మున్సిపల్ ఛైర్మన్ రజిని, డీఆర్‌వో అంబదాస్, సమగ్ర శిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ జ్యోతి, సీఎంవో రాజు, నర్సాపూర్ ఎంఈవో తారా సింగ్‌తో పాటుగా 8 మండలాల మండల విద్యాధికారులు, మండలాల రిసోర్స్ పర్సన్‌లు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
14, మే 2026, గురువారంభారత్ సమాచార్